శీతాకాలం లో చర్మం పొడిబారకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

శీతాకాలం లో చర్మం పొడిబారకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

శీతాకాలంలో సహజంగా ఎవరి చర్మం అయినా సహజంగా పగులుతుంటుంది. చర్మం పొడిబారడం వల్ల కొంతమందికి దురద కూడా వస్తుంటుంది. ఈ చలికాలo లొ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుకొనేందుకు క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది . క్యారెట్ తో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* క్యారెట్ సగం ముక్క క్యారెట్  తీసుకుని దాన్ని తురుం పట్టి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అందులో ఒక , ఒక టీస్పూన్ పాలు, టీస్పూన్ తేనె వేసి బాగా కలిపి చర్మానికి రాయాలి. 15 నిమిషాలు గడచిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మం తేమగా మారుతుంది అంతే కాకుండా  పగలకుండా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌గా కూడా వేసుకోవచ్చు.

* క్యారెట్లు  ఆయిలీ స్కిన్ ఉన్నవారికి కూడా చాలా  మేలు చేస్తాయి.క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ  చర్మం నుంచి విడుదలయ్యే నూనెలాంటి ద్రవాన్ని  బయటకు పంపుతుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. క్యారెట్ జ్యూస్ ఒక కప్పు తీసుకుని అందులో పెరుగు, శనగపిండి, నిమ్మరసంలను ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి పొందవచ్చు.

* చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి చర్మం తాజాగా మారాలి అంటే క్యారెట్ జ్యూస్, పెరుగు, ఎగ్ వైట్‌లను సమంగా  కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం తాజాగా అవడం మాత్రమే కాకుండా ముఖ సౌందర్యం పెరుగుతుంది.

* క్యారెట్ జ్యూస్, రోజ్ వాటర్‌ను సమపాళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో ఆ మిశ్రమాన్ని నింపి దాన్ని సన్ ప్రొటెక్షన్ స్ప్రే గా వాడుకోవచ్చు. దీంతో సూర్యకాంతి, దుమ్ము, ధూళిల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.

* క్యారెట్ జ్యూస్, అలోవెరా జ్యూస్‌లను కలిపి ఆ మిశ్రమాన్ని రాసుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం పగలకుండా మృదువుగా ఉంటుంది.