Top Search Queries on Google by the People of India

Top Search Queries on Google by the People of India

భారత దేశం లో 2019 లో గూగుల్ లో ఎక్కువగా పదాలు

మనకు ఏ విధమైన  సమాచారం కావాలన్నా ముందుగా గుర్తుకు వచ్చేది గూగుల్‌ . అది వినియోగదారులు వినియోగించడానికి సులభతరం కావడంతో ప్రతి ఒక్కరూ ఏదేని సమాచారం కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ నే ఉపయోగిస్తుంటారు. ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం 2019 సంవత్సరంలో వినియోగదారులు భారత్‌లో ఎక్కువగా వేటికోసం వెతికారు? అనే దానికి సంబంధించి నివేదికను విడుదల చేసింది. మొదటి పది స్థానాల్లో చోటుదక్కించుకున్న వాటిలో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ నుంచి ప్రభుత్వ పథకాల వరకు వున్నాయి. వాటి  వివరాలేంటో తెలుసుకుందాం ..

  1. క్రికెట్‌ ప్రపంచ కప్‌

2019 వ సంవత్సరం లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్‌ కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చింది. సొంత గడ్డపై జరిగిన ఫైనల్ లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. సెమీ ఫైనల్ లో  భారత్‌, న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైనా భారత్‌లో క్రికెట్‌ ప్రపంచ కప్‌ గురించి ఎక్కువ మంది  వెతికిన పదంగా అగ్రస్థానంలో ఉంది.

  1. లోక్‌సభ ఎన్నికలు

గూగుల్‌ ప్రకటించిన జాబితాలో ‘లోక్‌సభ ఎన్నికలు’ రెండో స్థానంలో నిలిచింది. 2019 ఏప్రిల్-మే మధ్య భారత దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎక్కువ  స్థానాలను గెలుచుకొని అధికారాన్ని సొంతం చేసుకుంది.

  1. చంద్రయాన్‌-2

చంద్రుడిపై  భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-2 ఎక్కువ మంది వెతికిన వాటిలో మూడో స్థానంలో నిలిచింది. చంద్రయాన్-2, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధన కోసం చేసిన రెండవ యాత్రకు ఉపయోగించిన నౌక. చంద్రుడిపై నిదానంగా, మృదువుగా దిగి (సాఫ్ట్ ల్యాండింగు), 14 రోజుల పాటు చంద్ర ఉపరితలంపై తిరుగుతూ, వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ నౌకలో భాగం. చంద్రయాన్-2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె-3 వాహనం ద్వారా ప్రయోగించారు.  ఈ ప్రయోగంలో ల్యాండింగ్‌కి కొద్దినిమిషాల ముందు విక్రమ్‌ ల్యాండర్‌లో తలెత్తిన లోపం కారణంగా అది కమ్యూనికేషన్‌ కోల్పోయింది.

  1. కబీర్‌ సింగ్

‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించిన  సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా నటించగా  కైరా అద్వానీ హీరోయిన్ గా నటించారు.  తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ హిందీలోనూ దర్శకత్వం వహించారు. అనూహ్యంగా ఈ జాబితాలో నాలుగో స్థానం దక్కించుకుంది.

  1. అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్

మన దేశంలో హాలీవుడ్‌ చిత్రాలకు ఉన్న ఆదరణ ఎక్కువనే చెప్పాలి. మార్వెల్ సంస్థ  రూపొందించింది విడుదల చేసిన  అవెంజర్స్‌ సిరీస్‌లో వచ్చిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది.

6.ఆర్టికల్‌ 370

 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 అనేది నిజానికి కేంద్రంతో జమ్ము-కశ్మీర్‌కు ఉన్న బంధం గురించి చెబుతుంది. ఈ సంవత్సరం ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేసింది. గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన జాబితాలో ఆర్టికల్‌ 370 ఆరో స్థానంలో నిలిచింది.

  1. నీట్‌ రిజల్ట్స్‌

నీట్(యూజీ) పరీక్ష ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష (నీట్‌) ఫలితాల కోసం ఎక్కువ మంది వెతికారు. మే 5న దేశవ్యాప్తంగా 154 పరీక్ష కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్(యూజీ) పరీక్ష నిర్వహించింది. గూగుల్‌లో ఎక్కువ  మంది శోధించిన జాబితాలో ‘నీట్‌ రిజల్ట్స్‌’ఏడో స్థానంలో నిలిచింది.

  1. జోకర్‌

జోక్విన్‌ ఫీనిక్స్‌ ప్రధాన పాత్రలో రూపొందిన హాలీవుడ్ చిత్రం జోకర్‌ . భారత దేశంలో ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది . గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది.

  1. కెప్టెన్‌ మార్వెల్

గూగుల్‌ విడుదల చేసిన ఈ జాబితాలో హాలీవుడ్‌ సినిమా కెప్టెన్‌ మార్వెల్. గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన జాబితాలో తొమ్మిదో స్థానంలో  ఉండటం విశేషం.

  1. పీఎం కిసాన్‌ యోజన

దేశంలోని అర్హులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) కింద ఏటా రూ.6 వేల సాయం అందించాలని ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న, సన్నకారు రైతులకు అరవై ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేల పింఛన్ అందించేందుకు వీలుగా పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకువచ్చారు.దీని కోసం ఎక్కువ మంది గూగుల్‌లో వెతికారట. దీంతో ఈ పదం టాప్‌-10 జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.